చరణ్,మహేష్ ల తో మళ్ళి చిత్రాలు చేయనున్న అశ్విని దత్

చరణ్,మహేష్ ల తో మళ్ళి చిత్రాలు చేయనున్న అశ్విని దత్

Published on Feb 4, 2012 3:39 PM IST

మహేష్ బాబు మరియు రామ్ చరణ్ తేజ్ లను పరిచయం చేసిన అశ్విని దత్ ఇప్పుడు తిరిగి వారితో పని చెయ్యబోతున్నారు.“రాజ కుమారుడు” చిత్రం తో మహేష్ బాబుని “చిరుత” చిత్రం తో రామ్ చరణ్ తేజ్ ని వైజయంతి బ్యానర్ మీద పరిచయం చేసారు తరువాత వీరు ఇద్దరిలో ఎవరితోనూ చిత్రాలు చెయ్యలేదు. ఇప్పుడు 2012లో అశ్విని దత్ రామచరణ్ మరియు శ్రీను వైట్ల కలయికలో ఒక చిత్రం నిర్మించబోతున్నారు. అదే విధంగా క్రిష్ దర్శకత్వం లో మహేష్ బాబు నటిస్తున్న చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నారు. రెండు వరుస విజయాలతో ఉన్న మహేష్ బాబు మరియు “ఆరెంజ్” లాంటి పరాజయం తో చరణ్ ఉన్నారు వీరు ఇరువురికి ఈ చిత్రాలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో వేచి చూడాలి.

తాజా వార్తలు