నెల రోజులు అనంతపురంలోనే వెంకటేష్

నెల రోజులు అనంతపురంలోనే వెంకటేష్

Published on Jan 12, 2020 11:00 PM IST

విక్టరీ వెంకటేష్ ‘అసురన్’ రీమేక్ కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా పూర్తైంది. వెంకీ లుక్ పట్ల టీమ్ చాలా సంతృప్తిగా ఉన్నారు. దీంతో రెగ్యులర్ షూట్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 20 నుండి మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. అది కూడా అనంతపురంలో. సినిమా మొత్తం గ్రామీణ నెపథ్యంలో సాగేది కావడంతో ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు టీమ్.

ఇక్కడ షెడ్యూల్ ఎకంగా నెల రోజులకు పైగానే జరగనుంది. కీలకమైన సన్నివేశాలను ఇక్కడే షూట్ చేయనున్నారు. అనంతరం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తారు. ఇందులో వెంకీ సరసన ప్రియమణి కథానాయికగా నటించనుంది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రానిలి మణిశర్మ సంగీతం అండించనున్నారు. నిర్మాత సురేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు