అసిస్టెంట్ గా చెయ్యాలనుకున్న డైరెక్టర్ తో హీరోగా రెండవ సినిమా.!

అసిస్టెంట్ గా చెయ్యాలనుకున్న డైరెక్టర్ తో హీరోగా రెండవ సినిమా.!

Published on Dec 14, 2012 10:00 AM IST

hero-nani
డైరెక్టర్ అవ్వాలనుకొని వచ్చి నటులైన వారు, నటులవ్వాలనుకొని వచ్చి ఇండస్ట్రీలో పలు విభాగాల్లో సెటిల్ అయిన వారు చాలా మందే ఉన్నారు. ఇలానే డైరెక్టర్ అవ్వాలనుకుని వచ్చి హీరోగా మారి తెలుగులో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న హీరో నాని. నాని, సమంత జంటగా నటించిన ‘ఎటో వెళ్లి పోయింది మనసు’ ఈ రోజు విడుదలైంది. ఈ సందర్భంగా ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ ‘ డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన నేను ఇప్పుడు హీరోనయ్యాను. గతంలో గౌతమ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన ‘కాక్కా కాక్కా’ (తెలుగులో ఘర్షణ) సినిమా చూసిన తర్వాత ఎలాగైనా అతని దగ్గర అసిస్టెంట్ గా చేయాలనుకున్నాను. కానీ నేను ఊహించని విధంగా ఆయన డైరెక్షన్లో నేను హీరోగా సినిమా చేయడం చెప్పలేనంత ఆనందంగా ఉంది. త్వరలోనే మా కాంబినేషన్లో మరో సినిమా చేయాలనుకుంటున్నాం. అది ద్విభాషా చిత్రం అయ్యే అవకాశం ఉందని’ అన్నాడు.

తాజా వార్తలు