మరో ఓటిటిలోకి ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’, రిలీజ్ డేట్ ఫిక్స్!

మరో ఓటిటిలోకి ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’, రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on May 21, 2025 11:05 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామా చిత్రమే “అర్జున్ సన్నాఫ్ వైజయంతి”. మరి డీసెంట్ హైప్ నడుమ వచ్చిన ఈ చిత్రం అదే రీతిలో రన్ అయ్యి రీసెంట్ గానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చింది. అయితే ఇపుడు మరో ఓటిటి యాప్ లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.

మరి ఈ చిత్రాన్ని మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు సొంతం చేసుకోగా అందులో ఈ మే 23 నుంచి అందుబాటులోకి వస్తున్నట్టుగా ఖరారు చేశారు. సో ప్రైమ్ వీడియో కాకుండా ఆహా లో చూడాలి అనుకునే వారు అందులో కూడా చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా సీనియర్ నటి విజయశాంతి పవర్ఫుల్ పాత్రలో నటించారు. అలాగే అశోక క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు