‘నాగ బంధం’ కోసం భారీ సెట్.. మహేష్ అర్జున్ సినిమా టెక్నీషియన్ తో

పెద కాపు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న తన రెండో సినిమానే “నాగ బంధం”. పాన్ ఇండియా నిర్మాతలు దేవాన్ష్ నామా అలాగే మధుసూధన రావు తెరకెక్కిస్తున్న ఈ సినిమా సాలిడ్ హిస్టారికల్ అండ్ ఫాంటసీ ఎలిమెంట్స్ తో గ్రాండ్ గా తెరకెక్కుతుంది.

ఇక ఈ సినిమాకి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఏకంగా 10 కోట్ల ఖర్చుతో హైదరాబాద్ నానక్రామ్ గూడాలో రామానాయుడు స్టూడియోస్ లో గ్రాండ్ సెట్టింగ్ వేసినట్టు తెలుస్తుంది. మరి ఈ సెట్ వర్క్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాలో మధురై మీనాక్షి ఆలయం సెట్ ని కన్నులకి కట్టినట్టుగా వేసిన తోట ధరణి సారధ్యంలో ఈ గ్రాండ్ సెట్ ని చెక్కారట.

ఇది ఈ మధ్య కాలంలో జరిగిన బెస్ట్ సెట్ వర్క్ అని కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం ఇందులో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా అభే సంగీతం అందిస్తున్నారు. అలాగే త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

Exit mobile version