కోడి రామకృష్ణ నూతన సినిమా ‘రాణి రానమ్మ’ ఈరోజు ఉదయం హైదరాబాద్లో లాంచనంగా మొదలైంది. ఈ ఫ్యామిలీ డ్రామాలో అర్జున్ మరియు లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రధారులు. దర్శకరత్న దాసరి నారాయణరావు క్లాప్ కొట్టగా కోడి రామకృష్ణ అర్జున్, లక్ష్మీ రాయ్ ల నడుమ మొదటి షాట్ షూట్ చేసారు. ఈ సినిమాని శైలజ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామచంద్రరావు నిర్మిస్తున్నారు. ఎస్. ఏ రాజ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
కోడి రామకృష్ణ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ “అర్జున్ కలయికలో వస్తున్న ఆరో సినిమా ఇది. ఇప్పటివరకూ మేము కలిసి చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాదించాయి. ఒక సామాన్య వ్యక్తి తన భావోద్వేగాలను వెల్లడించడానికి పడ్డ ఆవేదన ఈ సినిమా కధాంశం. ఇందులో ఉన్న రెండు బాల పాత్రలు సినిమాకి అదనపు బలాన్ని చేకూరుస్తాయి. అర్జున్, లక్ష్మీ రాయ్ కుడా వారి పాత్రలకు సరిగ్గా సరిపోయారు. యాక్షన్ సీన్లకు, భావోద్వేగాలకు భారీ రీతిలో ఆస్కారం ఉన్న సినిమా” అని అన్నారు.
ఈ సినిమా చిత్రీకరణ ఆగష్టులో ముగించి దాసరా కానుకగా మనకు అందించాలని అనుకుంటున్నారు. ‘రాణి రానమ్మ’ సినిమాను హైదరాబాద్, కేరళ,రాజమండ్రి మరియు శ్రీ లంక వంటి ప్రదేశాలలో తెరకేక్కించనున్నారు.