డిసెంబర్ చివర్లో ఎ ఫిల్మ్ బై అరవింద్ – 2 ఆడియో

డిసెంబర్ చివర్లో ఎ ఫిల్మ్ బై అరవింద్ – 2 ఆడియో

Published on Dec 19, 2012 2:39 PM IST

a-film-by-arvind
గతంలో శేఖర్ సూరి దర్శకత్వంలో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎ ఫిల్మ్ బై అరవింద్’. అప్పట్లో ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమాకి సీక్వెల్ గా ‘ఎ ఫిల్మ్ బై అరవింద్ -2’ తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఆడియోని డిసెంబర్ 26న విడుదల చేయనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్న ఈ సినిమాలో ‘ఈ రోజుల్లో’ ఫేం శ్రీ, కమల్ కామరాజు, అడోనికా, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ లో కనిపించిన రిషి కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. జి. ఫణీంద్ర నిర్మిస్తున్న ఈ సినిమా కొంత భాగాన్ని గోవాలో చిత్రీకరించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు