మురుగదాస్ కంబ్యాక్.. ఇంకా వెయిటింగ్!

AR-Murugadoss-Madharasi

సౌత్ సినిమా దగ్గర తనదైన సినిమాలతో ఎంతగానో అలరించిన దర్శకుల్లో మంచి మెసేజ్ ని కమర్షియల్ సినిమాలతో అందించే దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కూడా ఒకరు. మరి మురుగదాస్ నుంచి చివరిగా సర్కార్ ఒక్కటే తన మార్క్ హిట్ గా నిలిచింది. తర్వాత వచ్చిన దర్బార్ అంచనాలు అందుకోలేదు. ఇక దాని తర్వాత మురుగదాస్ చాలా గ్యాప్ తీసుకొని చేసిన చిత్రమే “మదరాసి”.

యంగ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా చేసిన ఈ సినిమాతో మురుగదాస్ మళ్ళీ కం బ్యాక్ ఇస్తారు అని అనుకున్న ఫ్యాన్స్ కి తన సినిమాల్లో హీరో చెప్పినట్టుగా వెయిటింగ్ అనే పదం ఇప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే మదరాసి సినిమాకి కూడా ఏమి పూర్తి పాజిటివ్ టాక్ ఎక్కడా రాలేదు. దీనితో మురుగదాస్ నుంచి మళ్ళీ తన రేంజ్ సినిమా వచ్చేందుకు సమయం ఇంకా ఉందనే చెప్పక తప్పదు.

Exit mobile version