‘కాంతార చాప్టర్ 1’కు ఏపీ ప్రభుత్వం బాసట.. టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్

‘కాంతార చాప్టర్ 1’కు ఏపీ ప్రభుత్వం బాసట.. టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్

Published on Sep 29, 2025 10:06 PM IST

Kantara-Chapter-1

కన్నడలో తెరకెక్కిన ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం ‘కాంతార చాప్టర్ 1’ దసరా కానుకగా అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్‌లో రికార్డులు బద్దలుకొట్టేందుకు రిషబ్ శెట్టి రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి బజ్ ఉండటంతో ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అనే ఆసక్తి నెలకొంది.

అయితే, ఏపీ ప్రభుత్వం కాంతార చాప్టర్ 1 చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. పర భాషా చిత్రం అనే పేరుతో మన రాష్ట్రంలో వేరుగా చూడాల్సిన అవసరం లేదనే విశాల దృక్పథాన్ని ‘కాంతారా చాప్టర్ – 1’ విషయంలో ఏపీ ప్రభుత్వం చూపించింది. ఈ చిత్ర టికెట్ ధరల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది.

దీనికి సంబంధించిన జీవో రావాల్సి ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వం ఈ చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా హొంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు