అజిత్ సరసన అనుష్క

అజిత్ సరసన అనుష్క

Published on Apr 6, 2014 6:12 PM IST

ajithanushka
ప్రస్తుతం తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ అంటే అది అనుష్క మాత్రమే. ఇవి కాకుండా ప్రస్తుతం అనుష్కకి తమిళంలో ఫుల్ డిమాండ్ ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా తమిళంలో కూడా సూపర్ హిట్ అందుకున్న ఈ భామ తెలుగు, తమిళ్ లో కంటిన్యూ గా సినిమాలు చేస్తూనే ఉంది.

తాజా సమాచారం ప్రకారం అనుష్క అజిత్ సరసన నటించనుంది. ఈ సినిమాకి గౌతం వాసుదేవ్ మీనన్ డైరెక్టర్. కానీ గౌతమ్ మీనన్ కానీ, అనుష్క కానీ ఈ విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదు. ఇటీవలే తమిళంలో జరిగిన ఆడియో కార్యక్రమంలో అనుష్క ఫ్రెండ్, ఫిల్మ్ మేకర్ ఎఎల్ విజయ్ అజిత్ తో సినిమా చేస్తుందని అనౌన్స్ చేసారు. అదే కార్యక్రమానికి గౌతం కూడా అతిధిగా వచ్చారు.

అలాగే రజినీ కాంత్ – కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి కూడా అనుష్కని హీరోయిన్ గా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

తాజా వార్తలు