కోలివుడ్లో తాజా సమాచారం ప్రకారం అనుష్క తమిళంలో మరో పెద్ద చిత్రాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. “శౌర్యం” శివ దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో అజిత్ సరసన అనుష్క నటించనున్నట్టు సమాచారం. ఇద్దరు తమిళంలో ప్రధాన తారలే అయినా ఎప్పుడు కలిసి నటించలేదు కాబట్టి ఈ కాంబినేషన్లో చిత్రం అంటే భారీ అంచనాలు ఉంటాయి. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ మొదలు పెట్టుకుంటుంది ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు. ఇదిలా ఉండగా అజిత్ ప్రస్తుతం విష్ణు వర్ధన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. అనుష్క తాజా చిత్రం “తాండవం” ఈరోజు తమిళంలో విడుదల అయ్యింది. త్వరలో నాగార్జున సరసన “డమరుఖం” లో కనిపించనుంది ఇది కాకుండా ప్రభాస్”వారధి” తమిళంలో “సింగం 2″,”అలెక్స్ పాండియన్” మరియు “ఇరండాం ఉళగం” చిత్రాలలో కనిపించనున్నారు. ఈ ఏడాది అనుష్క బిజీగా గడపనుంది.