వరుస సినిమాలతో, ప్రస్తుతం అనుష్క చాలా బిజీగా ఉంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న రజినీకాంత్ సినిమాకి ఒప్పుకున్నా అనుష్క, గౌతం మేనన్ దర్శకత్వం అజిత్ హీరోగా వస్తున్న మరో సినిమాలో కూడా నటించనుంది. తాజా వార్తలు చూసుకుంటే, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అనుష్క అడుగుపెట్టనున్నదని సమాచారం.
వివరాలలోకి వెళ్తే, రాఘవేంద్ర హెగ్డే దర్శకత్వంలో వస్తున్న ‘జగ్గు దాదా’ అనే కన్నడ సినిమాలో, దర్శన్ సరసన అనుష్క నటిస్తుందని సమాచారం. అన్ని అనుకున్నట్టే జరిగితే, ఈ సినిమా షూటింగ్ మే 20న మైసూర్ లో మొదలుకానుంది. అనుష్క బెంగుళూర్ కి చెందిన అమ్మాయి అయినప్పటికీ తను ఇంత వరకు కన్నడలో సినిమా చేయలేదు.
ప్రస్తుతం, అనుష్క తెలుగు ‘బాహుబలి’ మరియు ‘రుద్రమదేవి’ సినిమాలలో నటిస్తుంది.