స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘాటి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తుండగా ఈ మూవీ రిలీజ్ డేట్ను ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో అనుష్క పాత్ర ప్రేక్షకులను స్టన్ చేసే విధంగా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతుంది.
అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్ను జూలై 11న ఫిక్స్ చేశారు మేకర్స్. కాగా ఈ సినిమాకు సరిగ్గా నెల రోజులు మాత్రమే ఉండటంతో ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి ఓ స్ట్రైకింగ్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. అనుష్క యుద్ధానికి మరో 30 రోజులు మాత్రమే ఉందని వారు ఈ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో విక్రమ్ ప్రభు మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.