పెళ్లి వార్తలను ఖండించిన అనుష్క


పొడుగు కాళ్ళ సుందరి అనుష్క పెళ్లి పుకార్ల పై ఎట్టకేలకు స్పందించింది. గత కొద్ది రోజులుగా అనుష్క తల్లి తండ్రులు ఆమెకు పెళ్లి చేసే పనిలో పడ్డట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనుష్క మాట్లాడుతూ మీడియాలో ఉండే కొందరు నా పెళ్లి పై ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారో అర్ధం కావట్లేదు. నాకు పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు అందరికీ చెప్పి చేసుకుంటాను అన్నారు. ప్రస్తుతం అనుష్క నాగార్జున సరసన ‘డమరుకం’ సినిమాలో మరియు ప్రభాస్ సరసన ‘వారధి’ సినిమాల్లో నటిస్తుంది ఇవి కాకుండా తమిళ్లో విక్రమ్ సరసన ‘తాండవం’ అనే సినిమాలో నటిస్తుంది.

Exit mobile version