‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలకు సంగీతాన్ని అందించిన అనూప్ రూబెన్స్ మంచి పేరును సంపాదించుకున్నాడు . ఈ నెల మొదట్లో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఏఎన్ఆర్, నాగార్జున, నాగ చైతన్యలు ప్రధాన పాత్రలుగా, శ్రియ, సమంత హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా ‘మనం’కి సంగీతాన్ని అందించడానికి అంగీకరించాడు. తాజా సమాచారం ప్రకారం ఆయన ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రభస’ కి కూడా సంగీతాన్ని అందించనున్నాడు. ఇది తను తెలుగులో చేస్తున్న పెద్ద ప్రాజెక్ట్. గత కొద్ది నెలలుగా అనూప్ సంగీతానికి ఎన్.టి.ఆర్ చాలా ఇంప్రెస్ అయ్యాడు. దానితో ఈ సినిమా నిర్మాతలు అనూప్ కు ఈ ప్రాజెక్ట్ ను ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తాం.
ఎన్.టి.ఆర్ సినిమాకి సంగీతాన్ని అందించనున్న అనూప్ రూబెన్స్!
ఎన్.టి.ఆర్ సినిమాకి సంగీతాన్ని అందించనున్న అనూప్ రూబెన్స్!
Published on May 24, 2013 5:00 PM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- వరల్డ్ రెండో బిగ్గెస్ట్ ఐమ్యాక్స్ స్క్రీన్ లో ‘ఓజి’ ఊచకోత.. నిమిషాల్లో హౌస్ ఫుల్!
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- అక్కడ మార్కెట్ లో సాలిడ్ వసూళ్లతో “మిరాయ్”
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ‘మిరాయ్’లో ప్రభాస్ వాయిస్ ఓవర్.. అది రియల్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వారం క్రేజీ సిరీస్ లు, చిత్రాలివే !
- ప్రభాస్ ‘స్పిరిట్’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్