మరోసారి ఖరారైన ‘ఆటోనగర్ సూర్య రిలీజ్’ డేట్

Autonagar-Surya-Latest-Post
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన పవర్ఫుల్ యాక్షన్ డ్రామా ‘ఆటోనగర్ సూర్య’. ఈ సినిమా చాలా రోజుల నుంచి విడుదలకు నోచుకోవడం లేదు. ఇప్పటికే పలు సార్లు పలు తేదీలను అధికారికంగా అనౌన్స్ చేసి వాయిదా వేసారు. తాజా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చెయ్యడం కోసం డైరెక్టర్ దేవకట్టా, నిర్మాత అచ్చిరెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఇందులో ‘ఆటోనగర్ సూర్య’ ని ఫిబ్రవరి 27న రిలీజ్ చేస్తున్నామని తెలియజేశారు.

అచ్చిరెడ్డి మాట్లాడుతూ ‘ఇప్పటి వరకూ నాగ చైతన్య లోని హీరోని చూసారు, ఒక స్టార్ ని చూసారు,కానీ ఆటో నగర్ సూర్యతో చైతన్యలోని నటున్ని చూస్తారని’ అన్నాడు. నాగ చైతన్య సరసన సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.

ఒకవైపు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల వల్ల ఇప్పటికే రిలీజ్ డేట్ అనుకున్న సినిమాలు వస్తాయా లేదా అన్న సందిగ్దంలో ఉన్నాయి. ఈ టైంలో ఈ చిత్ర టీం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. అనుకున్న టైంకి ఈ సారన్నా రిలీజ్ అవ్వాలని ఆశిద్దాం..

Exit mobile version