తెలుగు సినిమా లెజెండ్ డా. అక్కినేని నాగేశ్వరరావు గారి దహన కార్యక్రమాలు రేపు మధ్యాహ్నం (జనవరి 23న) అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనున్నాయి. ముందుగా దహన కార్యక్రమాలను ఎర్రగడ్డలోని గ్రౌండ్స్ లో ప్లాన్ చేసారు కానీ వేదికని అన్నపూర్ణ స్టూడియోస్ కి మార్చారు. పోలీస్ గార్డ్ కూడా అధికారికంగా గన్ పేల్చి ఆయనికి నివాళులర్పిస్తారని ఆశిస్తున్నారు.
ప్రస్తుతం దానికి సంబందించిన కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అక్కినేని కుటుంబ సభ్యులు దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నారు.
ప్రస్తుతం డా. అక్కినేని నాగేశ్వరరావు బాడీ తన అభిమానుల సదర్శనార్ధం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉంచారు. గత కొద్దిరోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఏఎన్ఆర్ ఈ రోజు ఉదయం చనిపోయారు.