అక్కినేని చేతుల మీదుగా ‘కెవ్వు కేక’ ప్రారంభం


కామెడి కింగ్ ‘అల్లరి’ నరేష్ కొత్త చిత్రం ‘కెవ్వు కేక’ ఈరోజు హైదరాబాద్లో లాంచనంగా ప్రారంభమైంది. ఈ ముహూర్తపు వేడుకకి తెలుగు చలన చిత్ర సీనియర్ నటుడు డా. అక్కినేని నాగేశ్వర రావు హాజరయ్యారు మరియు ఈ చిత్ర మొదటి సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.

సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు. భీమ్స్, రాజ్ మరియు చిన్ని రాజ్ అనే ముగ్గురు కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం విభిన్నంగా ఉంటూ మరియు అల్లరి నరేష్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకేక్కుతుందని చిత్ర ప్రొడక్షన్ టీం చెబుతోంది. ఈ చిత్ర ముహూర్తపు వేడుక రామానాయుడు స్టుడియోలో జరిగింది.

Exit mobile version