తెలుగు చిత్ర పరిశ్రమలో లెజెండ్రీ నటుడు, దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కన్నుమూశారు. ఆయన ఇకలేరు అనేది నమ్మడానికి కాస్త కాస్త కష్టమైనా నిజం. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఎ.ఎన్.ఆర్ కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రిత్రం చనిపోయారు. అభిమానుల అండ, ప్రేమ తోడుగా ఉంటే ఈ క్యాన్సర్ ని సైతం జయిస్తాను అని చెప్పి ట్రీట్ మెంట్ కి వెళ్ళిన ఎ.ఎన్.ఆర్ ఇలా మధ్యలోనే కన్నుమూయడం తీరని బాధని మిగిల్చింది.
1924 సెప్టెంబర్ 20న జమించిన అక్కినేని తన 17 ఏళ్ళ వయసులో ‘ధర్మపత్ని’ సినిమాతో తెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఎంతో కీర్తి గడించిన అక్కినేని నాగేశ్వరరావు సుమారు 250కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన చివరిగా నటించిన చిత్రం మరియు అక్కినేని హీరోలంతా కలిసి చేసిన సినిమా ‘మనం’. 91 ఏళ్ళ వయసులోనూ కుర్రాడిలా ఉరకలెత్తే మనసున్న అక్కినేని నాగేశ్వర రావు ఇక లేరు అన్నది తెలుగుచిత్ర సీమని శోక సముద్రంలో ముంచెత్తుతోంది.
చిత్ర సీమ ఒక లెజెండ్రీ నటున్ని కోల్పోయినందుకు చింతిస్తూ, అక్కినేని కుటుంబ సభ్యులకు 123telugu.com తరపున మా సంతాపాన్ని తెలియజేస్తున్నాం.