ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మొత్తం నాలుగు ప్రాజెక్టులను అధికారికంగా ఒప్పుకున్నా సంగతి అందరికీ తెలిసిందే. అయితే మొదటి మూడు చిత్రాలు కోసం ఇప్పుడు మంచి హాట్ టాపిక్ నడుస్తుంది. అలాగే ఈ మూడింటిలో కూడా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పవన్ 27 వ చిత్రం కోసం మాత్రం పవన్ అభిమానులు ఎందుకో బాగా ఆసక్తి కనబరుస్తున్నారు.
అయితే ఈ చిత్రంకు సంబంధించి లేటెస్ట్ బజ్ ఒకటి గట్టిగా వినిపిస్తుంది. ఏఈ చిత్రాన్ని వకీల్ సాబ్ షూట్ పూర్తయ్యాక వెంటనే మొదలు పెట్టి వేసవి రేస్ లో ఉంచుతామని క్రిష్ కొన్నాళ్ల కితమే చెప్పేసారు. ఇప్పుడు క్రిష్ మరియు పవన్ లు అదే మాత్రకు స్టిక్ అయ్యి ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. సాధ్యమైనంత త్వరగా ఈ చిత్రాన్ని తెరకెక్కించి వేసవికే విడుదల చేసేయాలని అనుకుంటున్నారట. అలాగే అదే ఏడాది కూడా హరీష్ శంకర్ తో ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్ ను కూడా పవన్ మొదలు పెట్టనున్నారని మరో టాక్ వినిపిస్తుంది.