మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ సెన్సేషనల్ అప్డేట్ ను మేకర్స్ నిన్న విడుదల చెయ్యడంతో ఆ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో లేపేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు పాన్ ఇండియన్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు కాంబోలో సినిమా అనౌన్స్ చేసే సరికి ఆ అంచనాలు మరో స్థాయికి వెళ్లాయి.
అయితే జస్ట్ ఈ ఇద్దరి పేర్లతోనే సంచలనం రేపిన ఈ కాంబోపై ఇప్పుడు మరో సాలిడ్ బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో చరణ్ తో పాటుగా మరో టాప్ మోస్ట్ స్టార్ కూడా కనిపించనున్నాడని తెలుస్తుంది. అయితే ఆ వివరాలు ఇంకా తెలియరాలేదు కానీ ఆ స్టార్ హీరో ఒక కీలక పాత్రలో ఈ చిత్రంలో నటించనున్నట్టు తెలుస్తుంది. అయితే విలన్ గానే అన్నట్టు కూడా మరో టాక్. మరి ఇది ఎంత వరకు నిజమో కానీ ప్రస్తుతానికి అయితే మెగా ఫ్యాన్స్ ఈ సెన్సేషనల్ అప్డేట్ తో ఎంజాయ్ చేస్తున్నారు.