వ్యాపార రంగంలోకి మరో హీరోయిన్ ?

Tamannaah

కొందరు హీరోయిన్లు ఇప్పటికే వ్యాపార రంగంలో ఉన్నారు. నయనతార, రష్మిక లాంటి హీరోయిన్లు ఇప్పుడిప్పుడే వ్యాపారవేత్తలుగా మారుతున్న సంగతి తెలిసిందే. నయనతార ఓ కాస్మొటిక్ బ్రాండ్ ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. పైగా నయనతార సక్సెస్ ఫుల్ గా ఆ బిజినెస్ ను నడిపిస్తోంది. అటు రష్మిక కూడా ఓ పెర్ ఫ్యూమ్ బ్రాండ్ ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఆన్ లైన్ లో రష్మిక కంపెనీ విక్రయాలు చేస్తోంది. ఐతే, ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ తమన్నా వంతు వచ్చింది.

తన వ్యాపారానికి సంబంధించి తమన్నా హింట్ ఇస్తూ తాజాగా కొన్ని ఫొటోలు రిలీజ్ చేసింది. అయితే, తమన్నా కొత్త బిజినెస్ ఏంటనేది త్వరలోనే బయటకు రానుంది. తమన్నా ఇప్పటికే జ్యూవెలరీ బిజినెస్ లో ఉంది. తండ్రి ద్వారా కొన్ని ఔట్ లెట్స్ లో ఆమె పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు మరో కొత్త రంగంలోకి తమన్నా ప్రవేశించడానికి రెడీ అవుతోంది. మరోవైపు, సమంత నిర్మాతగా మారి సినిమాలు చేస్తోంది. మరి తమన్నా కూడా నిర్మాతగా మారుతుందా ? లేదా ? అనేది చూడాలి.

Exit mobile version