“జర్నీ” చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువయిన నటి అంజలి. ఆ చిత్రంలో ఆమె నటనకు గాను పలు ప్రశంసలు అందుకుంది. కాస్త విరామం తరువాత టాలీవుడ్లో ప్రతిష్ఠాత్మక మల్టీ స్టారర్ చిత్రం “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”లో సీత పాత్రలో కనిపించింది ఈ పాత్ర కూడా విమర్శకుల మరియు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
చాలా మంది అంజలి నటనను సౌందర్య నటనతో పోల్చారు. “సౌందర్య కోసం రచించిన పాత్రలు అంజలికి సరిగ్గా సరిపోతుంది” అని ఒక ప్రముఖ నిర్మాత అంజలిని ఉద్దేశించి అన్నారు. వెంకటేష్ మరియు మహేష్ బాబు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రంలో అంజలి వెంకటేష్ కి మరదలుగా కనిపించింది శ్రీకాంత్ అద్దాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు మిక్కి జె మేయర్ సంగీతం అందించారు.