గీతాంజలి పేరుతొ అంజలి తదుపరి సినిమా

గీతాంజలి పేరుతొ అంజలి తదుపరి సినిమా

Published on Apr 12, 2014 5:52 PM IST

Anjali
నటి అంజలి తెలుగుతెరపై కనబడి చాలాకాలం కావస్తుంది. సీతమ్మ వాకిట్లో .. సినిమాలో అందరినీ మెప్పించిన తరువాత బలుపుతో విజయం సాధించింది. తరువాత మసాలా సినిమాలో నటించినా అది విజయం సాధించలేదు

ప్రస్తుతం అంజలి ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటిస్తుందన్న విషయం మేము ముందే తెలిపాం. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు అందజేస్తున్నాం. ఈ సినిమాకు ‘గీతాంజలి’ అనే టైటిల్ ని ఖరారు చేసారట. రాజ్ కిరణ్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఎం.వి.వి సత్యన్నారాయణ నిర్మాత. కోన వెంకట్ స్క్రిప్ట్ ని అందించారు. ఈయనే ఈ సినిమాకు సమర్పకుడుకూడా. ఆయన, ఈ సినిమా పూర్తిస్థాయి ఎంటర్టైనర్ అని, కొన్ని సన్నివేశాలను మాత్రం హృదయాన్ని తాకుతాయని చెప్పాడు. అంతేకాక ఈ సినిమను , సినిమాలో అంజలి నటనని ఎప్పటికీ గుర్తించుకుంటారని చెప్పుకొచ్చాడు

ప్రవీణ్ లక్కరాజు సంగీతదర్శకుడు. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అంజలికాక బ్రహ్మానందం, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, మధునందన్ మరియు షకలక శంకర్ ముఖ్య పాత్రధారులు

తాజా వార్తలు