డాక్టర్ గా కనిపించనున్న అంజలి

డాక్టర్ గా కనిపించనున్న అంజలి

Published on Jun 23, 2013 7:00 PM IST

Balupu
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘బలుపు’ సినిమా ఈ శుక్రవారం అనగా జూన్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో రవితేజ సరసన శృతి హాసన్, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో అంజలి డాక్టర్ గా కనిపించనుంది. అలాగే ఆమె పాత్ర చాలా సాఫ్ట్ గా ఉండనుంది. ఈ సినిమా కథకి ఆమె పాత్ర చాలా కీలకం కానుంది.

గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో రవితేజ ఫుల్ రఫ్ లుక్ లో కనిపించనున్నాడు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, అలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పివిపి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ ‘బలుపు’ సినిమాకి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది.

తాజా వార్తలు