‘కూలీ’ పై అనిరుద్ రివ్యూ.. ఆ కారణం వెల్లడి

‘కూలీ’ పై అనిరుద్ రివ్యూ.. ఆ కారణం వెల్లడి

Published on Aug 5, 2025 9:05 PM IST

Coolie

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కింగ్ నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర తదితర అగ్ర తారాగణంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన భారీ చిత్రమే “కూలీ”. దీనిపై మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమాకి సంగీతం అనిరుద్ అందిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇది వరకు అనిరుద్ వర్క్ చేసిన సినిమాల్లో దేనికైనా ఎక్స్ ప్లాట్ ఫామ్ నుంచి ఒక పోస్ట్ ఎమోజిస్ తో కలిపి పెడితే అది స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని ఒక స్టాంప్ ఉంది. ఇలా తన రివ్యూ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేసేవారు. కానీ దీనిని ఇప్పుడు ఆపేసినట్టుగా తాను తెలిపాడు.

తనకి జైలర్ సినిమాకి మాత్రం బాగా అనిపించేసరికి పెట్టానని కానీ కొన్ని సినిమాలకి వాటి రిజల్ట్ నాకు ముందే అర్ధం అయ్యిపోతుంది అలాంటి వాటికి కూడా పెడితే తప్పు అవుతుంది అని అందుకే అన్నిటికి ఆపేసానని తెలిపాడు. కానీ కూలీ సినిమా మాత్రం సూపర్బ్ గా వచ్చింది అని రీసెంట్ ఇంటర్వ్యూలో సెలవిచ్చాడు. సో అనిరుద్ ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కాబట్టి కూలీ రిజల్ట్ కూడా అదిరే లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు.

తాజా వార్తలు