అనిరుధ్‌కు నాలుగో వార్నింగ్ ఇచ్చిన ఆడియన్స్..?

తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం ఒకప్పుడు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆయన నుంచి సంగీతం వస్తుందంటే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా హిట్ అని అందరూ నమ్ముతారు.

కానీ, కొంతకాలంగా అనిరుధ్ సంగీతం అందించిన సినిమాలు వరుస ఫెయిల్యూర్స్‌గా మారుతున్నాయి. ఇందులో రజినీకాంత్ నటించిన ‘వెట్టయన్’ చిత్రం నుంచి ఈ సమస్య మొదలైంది. ఇక ఆ తర్వాత అజిత్ ‘విడాముయార్చి’ చిత్రంలో అనిరుధ్ సంగీతం పెద్దగా ప్రభావం చూపలేదు. రీసెంట్‌గా వచ్చిన విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ చిత్రానికి కూడా అనిరుధ్‌పై నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది.

ఇక తాజాగా కూలీ చిత్రం కూడా అనిరుధ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చిందని చెప్పాలి. సినిమా ఎలా ఉందనే విషయం పక్కనబెడితే, ఈ సినిమాలో అనిరుధ్ మరోసారి తన మార్క్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయలేదనేది వాస్తవం. మరి ఇలా వరుస వార్నింగ్స్‌తో అనిరుధ్ మ్యూజిక్‌పై ప్రేక్షకులు ఇస్తున్న సంకేతాన్ని ఆయన గమనిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version