సంక్రాంతి సెంటిమెంట్ మిస్ అవుతున్న స్టార్ డైరెక్టర్

సంక్రాంతి సెంటిమెంట్ మిస్ అవుతున్న స్టార్ డైరెక్టర్

Published on May 23, 2020 6:34 PM IST

రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. అవి కూడా సంక్రాంతి హిట్స్ కావడంతో మంచి నోటెడ్ డైరెక్టర్ అయిపోయారు. 2019 సంక్రాంతికి ఎఫ్2 అనే కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో భారీ హిట్ అందుకున్నారు. రెండు బడా చిత్రాలను కాదని ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఈ ఏడాది మహేష్ తో ఆయన చేసిన సరిలేరు నీకెవ్వరు భారీ విజయాన్ని అందుకొంది. ఈ మూవీ మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకుంది. దీనితో ఆయన 2020 సంక్రాంతి సీజన్ పై కూడా కన్నేశాడు.

ఇప్పటికే తన రైటింగ్ టీమ్ తో ఎఫ్3 స్క్రిప్ట్ తో సిద్ధం అవుతున్న అనిల్ రావిపూడి ఎఫ్2 లో నటించిన వెంకీ, వరుణ్ లతో ఎఫ్3 తెరకెక్కించి సంక్రాంతికి విడుదల చేయాలని గట్టిపట్టుదలతో ఉన్నాడు. ఐతే ఇది జరిగే పరిస్థితి లేదని సమాచారం అందుతుంది. ఈ మూవీలో ఓ హీరోగా చేస్తున్న వెంకటేష్ లాక్ డౌన్ అనంతరం నారప్ప షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఆ తరువాత ఆయన కొంచెం విరామం తీసుకోనున్నారట. దీనితో ఎఫ్3 అనిల్ అనుకున్నట్లు సంక్రాంతి వచ్చే పరిస్థితి లేదని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు