తెలుగులో డబ్ అవుతున్న ‘లైఫ్ ఆఫ్ పై’

తెలుగులో డబ్ అవుతున్న ‘లైఫ్ ఆఫ్ పై’

Published on Oct 14, 2012 8:42 PM IST


‘క్రౌచింగ్ టైగర్’, ‘హిడెన్ డ్రాగన్’, ‘హల్క్’ మరియు ‘బ్రోక్ బ్యాక్ మౌంటైన్’ లాంటి ఇంగ్లీష్ చిత్రాలను తీసి ప్రపంచం మొత్తం ప్రసిద్ది కెక్కిన దర్శకుడు యాంగ్ లీ. తాజాగా అయన దర్శకత్వంలో సూరజ్ శర్మ, స్రవంతి సాయినాథ్, ఇర్ఫాన్ ఖాన్ మరియు టబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన 3డి సినిమా ‘లైఫ్ ఆఫ్ పై’. యాన్ మార్టెల్ రాసిన నవలా ఆధారంగా సుమారు 100 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కి ప్రపంచ నలుమూలల నుండి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే చాలా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శించిన ఈ చిత్రాన్ని నవంబర్లో గోవాలో జరగబోయే ఇండియా 43వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. ఆ తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వారు ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో డబ్ చేసి విడుదల చేయాలనుకుంటున్నారు. సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక పెద్ద షిప్ మునిగిపోగా అందులో నుంచి బతికిన పై అనే 16 సంవత్సరాల యువకుడు అక్కడి నుండి ఒక చిన్న పడవలో పై తో పాటు ఒక బెంగాల్ టైగర్, ఒక కోతి, ఒక జీబ్రా మరియు ఒక హైనాలతో అతని జర్నీ ఎలా సాగింది అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.

తాజా వార్తలు