“వెట్టై” తెలుగు రీమేక్ లో ప్రధాన పాత్ర కోసం ఆండ్రియా జెరేమియాతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్లో నాగ చైతన్య మరియు సునీల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరిద్దరూ ఈ చిత్రంలో అన్నదమ్ములగా కనిపించనున్నారు. నాగ చైతన్య ఈ చిత్రంలో ఆర్య పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో ఒక పాత్ర కోసం హన్సిక సంతకం చేశారు. మరో కీలకమయిన పాత్ర కోసం ఆండ్రియా జేరేమియాతో చర్చలు జరుపుతున్నారు. ఆండ్రియా చివరగా కార్తి సరసన “యుగానికి ఒక్కడు ” చిత్రంలో కనిపించారు. త్వరలో కమలహాసన్ “విశ్వరూపం” చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంతకం చేస్తే తెలుగు పరిశ్రమలో తన మొదటి చిత్రం ఇదే అవుతుంది. ఈ రీమేక్ కి కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.