సెన్సార్ పూర్తి చేసుకున్న అందాల రాక్షసి


ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్లు మరియు ట్రైలర్స్ వల్ల ‘అందాల రాక్షసి’ చిత్రానికి ఎ సెంటర్స్ అభిమానుల నుంచి మంచి స్పందన లబిస్తోంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. హను రాఘవపూడి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

‘ఈగ’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం యొక్క ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుక్కున్నారు. నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్ మరియు లావణ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రధన్ సంగీతం అందించారు. ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీని 1990 నేపధ్యంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఆగష్టు రెండవ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version