అప్పట్లో అనసూయకి ఆహీరో అంటే క్రష్ అట

అప్పట్లో అనసూయకి ఆహీరో అంటే క్రష్ అట

Published on Apr 29, 2020 10:00 AM IST

కింగ్ ఆఫ్ కామెడీ షోస్ గా ఉన్న జబర్ధస్త్ ఎంత ఫేమస్సో అందులోని గ్లామరస్ యాంకర్స్ లో ఒకరైన అనసూయ కూడా అంతే ఫేమస్. ఆ కామెడీ షో ఆమెకి తెచ్చిపెట్టిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. అనసూయ, రష్మీ ఈ షో ద్వారా వచ్చిన ఇమేజ్ తో సినిమా హీరోయిన్స్ కూడా మారిపోయారు. అనసూయ అవకాశం వచ్చినప్పుడల్లా హీరోయిన్ గా చేస్తూ ప్రాధాన్యం ఉన్న కీలక రోల్స్ చేస్తున్నారు. చరణ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర చేసిన ఆమె గత ఏడాది విడుదలైన కథనం మూవీలో హీరోయిన్ గా నటించడం జరిగింది.

మరి ఈ అందాల యాంకర్ ఫెవరేట్ హీరో ఎవరని అడిగితే టక్కున యాక్షన్ కింగ్ అర్జున్ పేరు చెప్పింది. అప్పట్లో సీనియర్ హీరో అర్జున్ నటించిన జెంటిల్ మెన్ మూవీ చూసి ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయిందట. ఆ రోజుల్లో అర్జున్ ఆమె క్రష్ అని చెప్పుకొచ్చింది అనసూయ. 1993లో భారీ చిత్రాల దర్శకుడు శంకర్ డెబ్యూ మూవీగా వచ్చిన జెంటిల్ మెన్ అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు