టాలీవుడ్ బుల్లితెరపై తన హోస్టింగ్ ట్యాలెంట్‌తో పాటు గ్లామర్‌తో తనకంటూ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్న భామ అనసూయ. ఆ తర్వాత ఆమె సినిమాల్లోనూ తన వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే అనసూయ చాలా వివాదాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
కాగా ఇప్పుడు మరోసారి అనసూయ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు అనసూయ గెస్ట్‌గా వచ్చింది. అక్కడ ఆమె స్టేజీపై మాట్లాడుతుంటే, కింద ఉన్న జనంలో కొందరు ఆకతాయిలు ఆమెపై కొన్ని కామెంట్స్ చేశారు. దీంతో అనసూయ కోపంతో రగిలిపోయింది.
వెంటనే చెప్పు తెగుద్ది.. పబ్లిక్‌లో అందరి ముందు చెప్పుతో కొట్టడానికి కూడా తాను వెనకాడనని.. మీ ఇంట్లో ఉండే తల్లి, అక్క, చెల్లి లను కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తారా.. అంటూ సదరు ఆకతాయిలపై ఫైర్ అయింది. ఆమె చేసిన కామెంట్స్ వీడియో రూపంలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.