అందరూ కనెక్ట్ అయ్యే ప్రేమకథ.. #90’s దర్శకుడితో మొదలుపెట్టిన ఆనంద్ దేవరకొండ

టాలీవుడ్‌లో ‘బేబీ’ మూవీతో హిట్ పెయిర్‌గా అవతరించారు హీరో ఆనంద్ దేవరకొండ, అందాల భామ వైష్ణవి చైతన్య. ఇక వీరి కాంబినేషన్‌లో ఇప్పుడు మరో సినిమా మొదలైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో క్లాసిక్ హిట్‌గా నిలిచిన వెబ్ సిరీస్ #90s దర్శకుడు ఆదిత్య హాసన్ డైరెక్షన్‌లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ముఖ్య పాత్రల్లో ఓ సినిమాను ఇటీవల అనౌన్స్ చేశారు.

ఇక తాజాగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ ప్రారంభించారు. దీనికి సంబంధించి సెట్స్ ఫోటోలను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ సినిమాలోని ప్రేమ కథ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ ముగించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version