శేఖర్ కమ్ముల తాజా చిత్రం అనామిక సినిమా ఫిబ్రవరిలో విడుదలకానుంది. హిందీలో విద్యాబాలన్ నటించిన ‘కహానీ’ సినిమాకు రిమేక్ గా తెలుగు, తమిళ భాషలలో రానుంది. ప్రధాన పాత్రను నయనతార పోషించగా హర్షవర్ధన్ రానే, వైభవ్ రెడ్డి ముఖ్యపాత్రధారులు
ఈ సినిమా ప్రచారకార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. అజయ్ శాస్త్రి పేరుతొ స్టేట్ అంతా పోస్టర్లు ప్రింట్ చేసారు. ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన మూడు టీజర్లు విడుదలచేసారు. అన్నీ పోగొట్టుకున్న భర్తను వెతికేక్రమంలో వున్నాయి. ఈ రిమేక్ లో కొన్ని మార్పులుచేసానని దర్శకుడు తెలిపాడు. మహిళాసంబంధిత వార్తలలో ఈమధ్య శేఖర్ చురుగ్గా పాల్గుంటున్నాడు
యండమూరి వీరేంద్రనాథ్ స్క్రిప్ట్ కు సహకారం అందించాడు. కీరవాణి సంగీతదర్శకుడు. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు