దసరాకి విడుదలకానున్న సినిమాల బరిలో అనామిక??

దసరాకి విడుదలకానున్న సినిమాల బరిలో అనామిక??

Published on Jul 10, 2013 3:00 PM IST

anamika_telugu_movie_nayana
సంక్రాంతి తరువాత ఎక్కువ శెలవులు వచ్చే పండుగ దసరా కాబట్టి ఆ సీజన్లో సినిమాలను విడుదల చెయ్యడానికి నిర్మాతలు తహతహలాడుతారు. ప్రస్తుతం హిందీలో విద్యాబాలన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘కహానీ’ సినిమా రీమేక్ లో నయనతార నటిస్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పేరు ‘అనామిక’గా ఖరారు చేసారు.ఈ సినిమాను దసరా టైంలో విడుదల చెయ్యాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ ను దర్శకుడు 50రోజులలో పూర్తి చెయ్యడం విశేషం. ప్రస్తుతం పద్మారావు నగర్ లో ప్రత్యేకంగా వేసిన కాళీమాత సెట్ లో మిగిలిన చిత్ర చిత్రీకరణ జరుపుకుంటుంది.ఎం.ఎం కీరవాణి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.

తాజా వార్తలు