పెటాలో చేరిన అమీ జాక్సన్

పెటాలో చేరిన అమీ జాక్సన్

Published on Jan 22, 2014 11:01 PM IST

Amy-Jackson
ఎవడు సినిమాలో నటించిన అమీ జాక్సన్ ఇప్పుడు పెటాకు ప్రచారకర్తగా చేయ్యికలిపింది. పెటా ఒక జంతు సంరక్షణాసంస్థ. “జంతువులకు దైవసంబందితులుగా మెలగండి. దత్తత తీస్కోండి. కొనకండి” అంటుంది. ఈమెతోపాటు త్రిష, ప్రియ ఆనంద్ కూడా జతకలిసారు.

ఆమె తన సొంత స్టొరీని చెప్పుకొస్తూ తాను అల్ఫీ అనే పిల్లిపిల్లను పెంచుతుందట. షాపులలో కొనేకంటే బయట అనాధ జంతువులకు రక్షణ ఇవ్వడం అవసరం అంటున్నారు. కేరళలో ఏనుగుల సంరక్షణా శాలలో సైతం ఈ భామ చురుగ్గా పాల్గోనుంది. ఎవడు తరువాత శంకర్ మనోహరుడు సినిమాలో విక్రమ్ సరసన కనిపించనుంది. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాత. ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదలకానుంది

తాజా వార్తలు