ఇప్పుడు ‘చందమామలో అమృతం’ కాస్తా ‘అమృతం – చందమామలో’ రూపంలో మనకు దొరుకుతోంది. క్రియేటివ్ గా ఓ డిఫరెంట్ కామెడీతో సినిమాలు తీసే గుణ్ణం గంగరాజు ఈ సినిమాకి నిర్మాత, దర్శకత్వం వహించాడు.
తాజా ఈ మూవీకి సంబందించిన ఒక వీడియో గేమ్ ని ఈ చిత్ర టీం లాంచ్ చేసారు. ఈ వీడియో గేమ్ సోషల్ నెట్వర్క్స్ లో బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం బాగా ఫేమస్ అయిన ‘టెంపుల్ రన్’ లాగా ఇది కూడా ఫేమస్ అవుతోంది. ఈ గేమ్ లో ఇద్దరు మాత్రమె పరిగెడుతూ ఉంటారు.
ఈ చిత్ర టీం ఏప్రిల్ లోఆడియో ని రిలీజ్ చేసి సినిమాని త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. శ్రీ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాల, వాసు, హరీష్, ధన్య ప్రధాన పాత్రలు పోషించారు.