స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ విజువల్స్ లోని క్వాలిటీని చూసి మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు. విజువల్స్ ఇంత సూపర్బ్ గా రావడానికి ఫేమస్ సినిమాటోగ్రాఫర్ అమోల్ రాధోడ్ గారే కారణం.
గత కొన్ని సంవత్సరాలుగా అమోల్ రాధోడ్ హై క్వాలిటీ పనితనాన్ని కనబరుస్తున్నారు. గతంలో ఈయన రామ్ గోపాల్ వర్మ తీసిన ‘రక్త చరిత్ర’ రెండు పార్ట్స్ కి, అలాగే పూరి జగన్నాథ్ తీసిన ‘బుడ్డా హోగా తేరా బాప్’ సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించాడు. పూరి తెలుగులో ఎప్పుడూ తీసుకునే రెగ్యులర్ సినిమాటోగ్రాఫర్ ని కాకుండా ‘ఇద్దరమ్మాయిలతో’ కోసం అమోల్ రాధోడ్ ని రంగంలోకి దించాడు. అమోల్ రాధోడ్ వర్క్ సినిమా యొక్క లుక్ మరియు ఫీల్ ని పూర్తిగా మార్చేసిందని ఈ చిత్ర యూనిట్ చెబుతున్నాయి.
‘ ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా పూరి కెరీర్లోనే మోస్ట్ కలర్ఫుల్ మూవీ అవుతుంది, అలాగే పూరి సినిమాల్లో బెస్ట్ సినిమాటోగ్రఫీ అవుతుందని’ చిత్ర వర్గాలు అంటున్నాయి. అల్లు అర్జున్ కూడా అమోల్ రాథోడ్ వర్క్ చాలా సుపర్బ్ అని అని చెబుతున్నారు. చూస్తుంటే అమోల్ రాథోడ్ క్వాలిటీ వర్క్ తో ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ మరో సక్సెస్ఫుల్ సినిమాని తన ఖాతాలో వేసుకునేలా ఉన్నారు.