మే 25న అంతకుముందు.. ఆ తరువాత ఆడియో

మే 25న అంతకుముందు.. ఆ తరువాత ఆడియో

Published on May 17, 2013 3:20 PM IST

AMAT
‘అంతకుముందు.. ఆ తరువాత ఆడియో ‘ సినిమా ఆడియో మే 25న హైదరాబాద్లో విడుదలకానుంది. ఎం.ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ ఈ సినిమాలో హీరోకాగా,ఈషా తెలుగు తెరకు హీరొయిన్ గా పరిచయం కానుంది. ‘అష్టా చమ్మా’,’గోల్కొండా హై స్కూల్’ వంటి సినిమాలు తీసిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాకు నిర్మాత. కె.ఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మాత. దర్శకుడు తన జీవితంలో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనలు ఆధారంగా మానవీయ విలువలతో తీసిన సినిమా. ఇందులో మధుబాల ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. కళ్యాన్ కోడూరి బాణీలకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి, అనంత శ్రీరాంల సాహిత్యం తోడవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో మన ముందుకురానుంది.

తాజా వార్తలు