వాయిదా పడిన ‘అంతకు ముందు.. ఆ తరువాత’ ఆడియో

వాయిదా పడిన ‘అంతకు ముందు.. ఆ తరువాత’ ఆడియో

Published on May 23, 2013 12:51 PM IST

anthaku-mundhu-aa-taruvatha

‘అంతకు ముందు.. ఆ తరువాత’ సినిమా ఆడియోని మే 30న విడుదల చేయనున్నారు. ఈ సినిమా నిర్వాహకులు ముందుగా ఈ సినిమా ఆడియోని మే 25న విడుదల చేయాలనుకున్నారు. కానీ అనుకోని కారణాల వాళ్ళ ఈ సినిమా ఆడియోని మే 30న విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా తెలియజేశారు. కళ్యాణి కోడూరి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనంత శ్రీ రామ్, శ్రీకాంత్ శర్మలు పాటలను అందించారు. ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, ఈశలు జంటగా నటిస్తున్నారు. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాని కె. ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ప్రేమలో పడిన జంటకు పెళ్లి చేసుకోవడానికి ముందు జరిగే పరిణామాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా ఒక వాస్తవంగా జరిగిన ప్రేమ కథలా ఉంటుందని మోహన్ కృష్ణ తెలియజేశాడు. ఈ సినిమా జూన్ రెండవ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు