విజయ్ ను పెళ్లాడనున్న అమలాపాల్?

amala-paul---al-vijay
తన స్నేహితుడు, ప్రముఖ దర్శకుడు అయిన ఏ.ఎల్ విజయ్ తో నటి అమలాపాల్ కు వివాహం జరిగే సూచనలు వున్నాయి. వీరు గతంలో దైవ తిరుమగల్ అనే సినిమాకోసం కలిసి పనిచేసారు. తెలుగులో ఈ సినిమా నాన్న గా విడుదలైంది. గతకొంతకాలంగా వీరిమధ్య నడుస్తున్న వ్యవహారంపై పుకార్లు వస్తున్నా ఈ జంట ఏమాత్రం స్పందించలేదు

నిన్న తమిళ మీడియా వీరిపై కధనం రాస్తూ వీరికి ఈ జూన్ లో వివాహం జరగనుందని అధికారికంగా వెల్లడించారు. దీంతో అమలా ఈ వ్యవహారంలో కలుగజేసుకుని మా మధ్య వున్న సంబంధం ఏమిటో విజయ్ ఫారెన్ నుండి రాగానే వెల్లడిస్తాం. అంతవరకూ మీడియా స్నేహితులు కాస్త చూసుకుని కధనాలు రాయండి అని తెలిపింది

తెలుగులో ఈ భామ వస్తా నీ వెనుక సినిమాలో హవీష్ కు జంటగా నటించనుంది. ఈ చిత్ర బృందం త్వరలో యూరప్ వెళ్లనున్నారు

Exit mobile version