శ్రీదేవి పాటలకు అమల పాల్ ఆట

శ్రీదేవి పాటలకు అమల పాల్ ఆట

Published on Oct 12, 2012 12:00 PM IST


ఈ మధ్య కాలంలో అమలా పాల్ కెరీర్ వేగవంతంగా నడుస్తుంది. తెలుగు మరియు తమిళంలో వెనుక వెనుకనే పెద్ద పెద్ద చిత్రాలు రావడం ఈ నటి అదృష్టం అని చెప్పాలి. ఈ మధ్య ఒక తమిళ ప్రముఖ పత్రిక ఒకానొక ఈవెంట్లో ఆమెను ప్రదర్శన ఇవ్వమని కోరగా ఆమె వెంటనే ఒప్పుకున్నారు. ఈ విషయం పట్ల ఆమె చాలా ఆనందంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఈవెంట్ సినిమా పరిశ్రమలో మహిళలు ప్రాముఖ్యత గురించి ఉంటుంది ఇందులో అమల పాల్ శ్రీ దేవి పాటలకు డాన్స్ చెయ్యనుంది. శ్రీదేవి మీద తనకున్న అభిమానాన్ని ఇలా తెలుపుకోవాలని అమలా పాల్ అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ నటి చేతిలో మూడు పెద్ద చిత్రాలు ఉన్నాయి రామ్ చరణ్ సరసన “నాయక్”, అల్లు అర్జున్ సరసన “ఇద్దరు అమ్మాయిలతో మరియు సముధ్రఖని దర్శకత్వంలో వస్తున్న ద్విభాషా చిత్రం “జెండా పై కపిరాజు”లో ఈ నటి నటిస్తుంది.

తాజా వార్తలు