అక్కినేని అమల రాజకీయాలలోకి వస్తున్నారు అని చాలా రోజుల నుండి మీడియాలో వస్తూన వార్తలకు, అమల తెర దించారు. తన రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వార్తలను ఖండించారు. ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఏ పనిలోనైన నిజాయితీగా ఉండే నేను రాజకీయాలలో ఉండలేనని చెప్పారు.
ఇప్పుడు నేను చేస్తున్న సమాజ సేవతో చాలా ఆనందంగా ఉన్నాను, రాజకీయాలపై నాకు ఆసక్తి లేదు అని అమల అన్నారు.
కొన్ని రోజుల క్రితం అమల రాజకీయ అరంగేట్రం గురించి చాలా వార్తలు మీడియాలో సంచలనం సృష్టించాయి. అమల ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున పోటి చేస్తున్నారని వార్తలు వినిపించాయి.