విలక్షణ నటి అమల అక్కినేని గత సంవత్సరం ‘లైఫ్ ఈస్ బ్యూటిఫుల్’ సినిమాతో తిరిగి తెరపై కనిపించింది. శ్రీమతి అమలని ఇప్పుడు మళ్ళీ ‘అల్ ఐ వాంట్ ఈజ్ ఎవ్విరిథింగ్’ సినిమాలో ఒక అతిధి పాత్రలో 10 సెకండ్స్ కనిపించనుంది. ఈ సినిమాని ప్రముఖ నటి, యాంకర్ ఝాన్సీ నిర్మించింది. దీనికి శీతల్ మొర్జరియా దర్శకత్వం వహించింది. 60నిమిషాల ఈ సినిమాని హైదరాభాద్లో కొన్ని థియేటర్స్ లో మాత్రమే విడుదల చేయనున్నారు. అలాగే ఇక్కడి అన్ని మల్టీ ప్లేక్సులలో ఈ సినిమా మూడు రోజులు అనగా మార్చి 8,9,10 తేదీలలో మాత్రమే ప్రదర్శించనున్నారు. ఆడవారి అనుబందంపై డాక్యుమెంటరి సినిమా తరహాలో దీనిని తెరకెక్కించారు. ముగ్గురు అమ్మాయిలు ప్రతిరోజు ఎదుర్కొనే సమస్యలను ఈ సినిమా ద్వారా చూపించనున్నారు. దీనిలో వివాహానికి ముందు గర్భం దాల్చడం, స్వలింగ సంపర్కం మొదలగు అంశాలపై ఈ సినిమాని నిర్మించారు.