క్లీన్ ‘యు సర్టిఫికేట్ పొందిన అల్లు శిరీష్ ‘గౌరవం’

First Posted at 12:40 on Apr 17th

Gouravam

అల్లు శిరీష్ హీరోగా పరిచయమవుతున్న ‘గౌరవం’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు వారు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చారు. రాధా మోహన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని డ్యూయెట్ మూవీస్ బ్యానర్ పై ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్నాడు కుల వ్యవస్థ, దానివల్ల జరిగే గొడవల మీద తెరకెక్కిన ఈ సినిమాలో యామి గౌతం హీరోయిన్ గా నటించింది. రాధా మోహన్ ఇప్పటికే విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని అల్లు శిరీష్ ఎంతో నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమా కంటెంట్ ని, థీం లైన్ విని మెగాస్టార్ చిరంజీవి కూడా మెచ్చుకున్నారు.

Exit mobile version