అల్లు స్టూడియోస్ కోసం భారీ ఖర్చు చేస్తున్నారట.!

అల్లు స్టూడియోస్ కోసం భారీ ఖర్చు చేస్తున్నారట.!

Published on Oct 4, 2020 3:06 PM IST

ఇటీవలే అల్లు వారి కుటుంబం టాలీవుడ్ ఒక ఫిల్మ్ స్టూడియోకు నాంధి పలికిన విషయం తెలిసిందే. స్వర్గీయ అల్లు రామలింగయ్య గారి 99వ జయంతి సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అలాగే వారి తనయులు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బాబీ మరియు అల్లు శిరీష్ లు ప్రకటించారు.

అయితే హైదరాబాద్ గండిపేట ప్రాంతంలో మొత్తం పది ఎకరాల్లో ప్లాన్ చేసిన ఈ “అల్లు స్టూడియోస్” పనులు అతి తొందరలోనే మొదలు కానుండగా ఇపుడు ఓ ఆసక్తికర టాక్ ఈ స్టూడియోకు సంబంధించి తెలుస్తుంది. ఈ స్టూడియో కోసం అల్లు వారి కుటుంబం ఏకంగా 80 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారట.

అనేక రకాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిపే చిన్న స్టూడియోలు అలాగే వీరి స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ “ఆహా” కు సంబంధించి షూటింగ్ లు అత్యధికంగా ఇక్కడే జరపనున్నారని తెలుస్తుంది. మొత్తానికి మాత్రం అల్లు వారి కుటుంబం చాలా మంచి ప్లానింగ్ లో ఉన్నారని చెప్పాలి.

తాజా వార్తలు