తన లుక్ మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్న బన్ని

తన లుక్ మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్న బన్ని

Published on Dec 16, 2012 10:11 AM IST

allu-arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘ఇద్దరమ్మాయిలతో’. ఈ సినిమాలో బన్ని తన లుక్, స్టైల్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకొంటున్నాడు. ఇటీవలే బన్నికి 60 డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో ఫోటోషూట్ చేసారని ఇదివరకే మేము తెలిపాము. బన్ని ఒక్క కాస్ట్యూమ్స్ విషయంలోనే కాకుండా స్టైల్ కి సంబందించిన చిన్న విషయాల్లో కూడా అంటే వాచ్, రింగ్స్, బెల్ట్ లాంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకొని పాత్రకి తగ్గట్టుగా పర్ఫెక్ట్ లుక్ కోసం ఇంట స్పెషల్ కేర్ తీసుకొంటున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ఈ నెల 19న బ్యాంకాక్లో ప్రారంభం కానుంది. ఈ సినిమాని ఎక్కువభాగం బ్యాంకాక్, న్యూజీల్యాండ్ లలో చిత్రీకరించనున్నారు. బన్ని తొలిసారిగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో ఆడిపాడనున్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అమాలా పాల్, కేథరిన్ థెరిసా హీరోయిన్స్. యంగ్ తరంగ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు