జనవరిలో అల్లు అర్జున్ ‘రేస్ గుర్రం’ విడుదల?

జనవరిలో అల్లు అర్జున్ ‘రేస్ గుర్రం’ విడుదల?

Published on Aug 24, 2013 10:06 AM IST

bunny

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రేస్ గుర్రం’. ప్రస్తుతం ఈ సినిమా అండర్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ సినిమాని జనవరిలో విడుదల చేయాలని నిర్వాహకులు బావిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలకావచ్చు. ఈ సినిమా కొన్ని షెడ్యూల్స్ మిగిలివున్నాయి. వాటిని కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి నిర్వాహకులు వేగంగా పనులను పూర్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రొడక్షన్ టీం ఈ సినిమాకు సంబందించిన ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ సినిమాకు సంబందించిన కొన్ని పాటలను ఈ మద్య షూట్ చేయడం జరిగింది. అలాగే ఈ మద్య నిర్వహించిన కొన్ని ఫైట్ సన్నివేశాలలో కూడా అల్లు అర్జున్ పాల్గొన్నాడు. శృతి హసన్, సలోని హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని సమాచారం. ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

తాజా వార్తలు