మే 2న మొదలుకానున్న అల్లు అర్జున్ తదుపరి సినిమా

మే 2న మొదలుకానున్న అల్లు అర్జున్ తదుపరి సినిమా

Published on Apr 28, 2013 3:10 PM IST

Allu-Arjun
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ కధానాయకుడిగా కనిపించనున్న కొత్త సినిమా మే 2 నుండి మొదలుకావచ్చు. ప్రస్తుతానికి ఈ సినిమా పేరు ‘రేసు గుర్రం’ అని నిర్ణయించారు. ఈ సినిమాలో మొదటిసారిగా అల్లు అర్జున్ సరసన శ్రుతి హాసన్ హీరొయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా గత ఏడాది అక్టోబర్లో లాంచనంగా మొదలైంది. నల్లమలపు బుజ్జి-డా కె వెంకటేశ్వర రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్. వక్కంతం వంశీ కధను అందించాడు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదల కావచ్చు. అల్లు అర్జున్ ని త్వరలో పూరి జగన్నాధ్ తీసిన ‘ఇద్దరమ్మాయిలతో’ లోనూ, రామ్ చరణ్ కధానాయకుడిగా కనిపించనున్న ‘ఎవడు’లో ఒక ముఖ్య పాత్రలోనూ చూడచ్చు. .

తాజా వార్తలు